HomeTelugu Trendingబ్యూటీ విత్‌ బలం

బ్యూటీ విత్‌ బలం

Mehaboob shares his and div
తెలుగు ‘బిగ్‌బాస్‌- 4’ గ్రాండ్‌ ఫినాలేకు సిద్దమవుతోంది. విజేతగా ఎవరు నిలుస్తారా అని బిగ్‌బాస్‌ ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురూచుస్తున్నారు. ఈ నేపధ్యంలో హౌస్‌ నుండి ఎలిమినేట్‌ అయిన మెహబూబ్ దిల్‌సే‌, దివిలకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో దివి మహబూబ్‌ను ఎత్తుకుని ఫొటోలకు ఫొజిచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను మెహబుబ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా‌ గురువారం షేర్‌ చేశాడు.

వీటిని ‘బ్యూటీ విత్‌ బ్రెయిన్‌ యే కాదు.. బ్యూటీ విత్‌ బలం కూడా’ అంటూ మెహబూబ్‌ పోస్టు చేశాడు. బిగ్‌బాస్‌లో మహబుబ్‌ కండలవీరుడన్న సంగతి తెలిసిందే. అలాంటి మెహబూబ్‌ను దివి అలవోకగా ఎత్తుకోవడమే కాక ఎంచక్కా ఫొటోలకు ఫొజులు ఇవ్వడం చూసి నెటిజన్లంతా ఆశ్చర్యపోతున్నారు. దీంతో ‘నిజంగానే దివి బ్యూటీ విత్‌ బలం’ అంటూ ప్రశంసిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Mehaboob Shaikh 👑 (@mehaboobdilse)

Recent Articles English

Gallery

Recent Articles Telugu