సూపర్‌స్టార్స్‌ ఇప్పటికైనా మాట్లాడండి: శ్రద్ధా శ్రీనాథ్‌


రీల్‌ లైఫ్‌లో ఆడవారిని వేధించే రౌడీల బెండు తీసే సూపర్‌స్టార్లు.. రియాలిటీలో మాత్రం మౌనంగా ఉన్నారెందుకంటూ దక్షిణాది నటి శ్రద్ధా శ్రీనాథ్‌ మండి పడ్డారు. ఆడవారి మీద వేధింపులకు వ్యతిరేకంగా ప్రారంభమైన మీటూ ఉద్యమానికి దేశవ్యాప్తంగా భారీ మద్దతు లభిస్తోంది.. కానీ పరిశ్రమకు చెందిన స్టార్‌ హీరోలు మాత్రం ఈ విషయంలో మౌనమే శరణ్యమన్నట్లు ఉన్నారు. అమితాబ్‌ బచ్చన్‌, రజనీకాంత్‌ లాంటి అగ్ర హీరోలు మీటూ గురించి స్పందించినా.. చాలా దౌత్యంగా మాట్లాడారు.

తమిళ్‌, తెలుగు బడా హీరోలు మాత్రం ఇంత వరకూ ఈ విషయం గురించి నోరు మెదపలేదు. దాంతో స్టార్‌ హీరోల మౌనాన్ని ప్రశ్నిస్తూ నటి శ్రద్ధ వరుస ట్వీట్‌లు చేశారు. ‘తల్లిని, అక్కాచెల్లళ్లని వేధించే విలన్‌ల బెండు తీస్తారు.. అవసరమైతే భారీ ట్రక్కులను కూడా అవలీలగా గాల్లో ఎగిరిలే చేస్తారు. అయితే ఇవన్ని కేవలం 70 ఎమ్‌ఎమ్‌ స్ర్కీన్‌ మీద మాత్రమేనా. ఇప్పుడు కూడా ఆ మ్యాజిక్‌ చూపించండి. ప్లీజ్‌ సూపర్‌స్టార్స్‌ ఇప్పటికైనా మాట్లాడండి. నేను మీ స్పందన ఏంటో తెలుసుకోవాలని ఎదురు చూస్తున్న’ అంటూ శ్రద్ధ ట్వీట్‌ చేశారు.

CLICK HERE!! For the aha Latest Updates