భర్త పక్కనుండగానే గాయనిని ముద్దాడిన అభిమాని.. వీడియో వైరల్

పాప్‌ సింగర్‌ మైలీ సైరస్‌కు చేదు అనుభవం ఎదురైంది. తన భర్త, హాలీవుడ్‌ నటుడు లయామ్‌ హెమ్స్‌వర్త్‌తో కలిసి విహారయాత్ర నిమిత్తం స్పెయిన్‌లోని బార్సిలోనాకు వెళ్లారు. వీరిద్దరిని చూసిన అభిమానులు ఒక్కసారిగా ఆటోగ్రాఫ్‌లు, ఫొటోగ్రాఫ్‌ల కోసం వారి చుట్టూ గుమిగూడారు. తన భర్తతో కలిసి మైలీ కారు వైపు నడుస్తుండగా ఓ అభిమాని ఆమె జుట్టు పట్టుకుని బుగ్గపై ముద్దుపెట్టుకున్నాడు. అది గమనించిన సెక్యూరిటీ సిబ్బంది అతన్ని పక్కకు నెట్టేశారు. అభిమాని ప్రవర్తనను చూసి మైలీ భర్త కూడా కోపగించుకున్నారు. అయితే ఈ ఘటనపై మైలీ కానీ ఆమె భర్త కానీ స్పందించలేదు. ఆ సమయంలో తీసిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది.