గ్లామర్ గా మారబోతున్న పార్లమెంట్

రాజకీయ నాయకులు అనగానే ఖద్దరు దుస్తులు ధరించి… భారీగా కనిపించే ఆకారాలతో గాంభీర్యంగా ఉండే వ్యక్తులు కళ్ళముందు కనిపిస్తారు. వారి మాట కూడా అంటే కటువుగా ఉంటుంది. ఇది ఒకప్పటి మాట. కాలం తో పాటు అన్నింటిలోనూ మార్పులు వస్తున్నాయి. రాజకీయాల్లోకి యువత ఎక్కువగా వస్తున్నారు. చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి చట్ట సభల్లో వారి గళాన్ని వినిపిస్తున్నారు.

సినిమా రంగంలో బాగా రాణించిన తరువాత రాజకీయాల్లోకి వచ్చేవారు కొందరైతే… అనుకోకుండా అవకాశం రావడంతో గాలివాటంగా విజయం సాధించే వ్యక్తులు కొందరు ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే నిలదొక్కుతుంటున్న మిమి చక్రవర్తి, నుస్రత్ లు పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఈ ఇద్దరు హీరోయిన్ల రాకతో పార్లమెంట్ మరింత గ్లామర్ గా మారబోతున్నది.