Homeతెలుగు Newsప్రధాని మోడీ ఒక అవినీతిపరుడు: రాహుల్‌

ప్రధాని మోడీ ఒక అవినీతిపరుడు: రాహుల్‌

కర్నూలులో కాంగ్రెస్‌ చేపట్టి భారీ బహిరంగ సభలో రాహుల్‌ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని ఇప్పటికే సీడబ్ల్యూసీలో తీర్మానం చేశాం. కేంద్రంలో అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదాపైనే తొలి సంతకం. ఇది దయాదాక్షిణ్యాలతో ఇచ్చే కానుక కాదు. ఇది ఆంధ్రప్రదేశ్‌ ప్రజల హక్కు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు బాకీ తీర్చాల్సిన బాధ్యత ప్రధానిగా ఎవరున్నా వారిపై ఉంటుంది. ప్రత్యేక హోదా అనేది ప్రధాని కుర్చీకి, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఉన్న సంబంధమే. విభజన సమయంలో ఏపీ బాగు కోసం కాంగ్రెస్‌ ఎన్నో హామీలు ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటు తదితర హామీలిచ్చాం. అవన్నీ నెరవేర్చి తీరుతాం. ప్రధానిగా ఎవరు ఉన్నా.. పార్లమెంట్‌ నిర్ణయాలను అమలు చేయాల్సిందే. 2014 ఎన్నికల తర్వాత ప్రధాని మోడీ ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారు. ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15లక్షలు వేస్తామన్నారు? కానీ ఎక్కడైనా వేశారా? రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు? ఏ ఒక్కరికన్నా ఉద్యోగాలు వచ్చాయా?

10 13

నేను దేశం విడిచి పోతున్నా.. అని విజయ్‌మాల్యా దేశ ఆర్థికమంత్రికే చెప్పి వెళ్లారు. రూ.9వేల కోట్లు దోచుకున్న వ్యక్తిని నిలువరించే బాధ్యత దేశ ఆర్థికమంత్రికి లేదా? ఆర్థికిమంత్రికి ఆమ్యామ్యాలు అందినందువల్లే మాల్యాను దేశం దాటించారు. దేశంలో 125 కోట్ల మందికి కాపలాదారుగా ఉంటానన్న మోడీ చోద్యం చూస్తూ ఉండిపోయారు. మోడీ చాలా ఆసక్తిరమైన కాపలాదారు. దొంగలకు ద్వారాలు తెరిచే కాపలాదారు. రాఫెల్‌ యుద్ధవిమానాల కొనుగోళ్లలో మోడీ అవినీతికి పాల్పడ్డారు. అనుభవం ఉన్న హెచ్‌ఏఎల్‌ను కాదని అనుభవం లేని అనిల్‌ అంబానీకి కాంట్రాక్టు ఇచ్చారు. రూ.526 కోట్ల విలువైన ఒక్కో యుద్ధ విమానాన్ని రూ.1600 కోట్లకు కొన్నారు. అనిల్‌ అంబానీ బ్యాంకుల నుంచి రూ.45వేల కోట్లు కొల్లగొట్టారు. సాక్షాత్తూ ప్రధానమంత్రే ఒక అవినీతిపరుడు. జీఎస్‌టీ, నోట్లరద్దు నిర్ణయాలు దేశ సంక్షేమం కోసం తీసుకున్నవి కాదు. ప్రజల జేబుల నుంచి కొల్లగొట్టి పారిశ్రామికవేత్తలకు వేల కోట్లు దోచిపెడుతున్నారు. మేం అధికారంలోకి రాగానే రైతుల రుణాలు మాఫీ చేస్తాం అని రాహుల్‌ గాంధీ’ అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu