మోహన్‌ బాబు బర్త్‌డే స్పెషల్‌.. ‘సన్నాఫ్ ఇండియా’ పోస్టర్‌


టాలీవుడ్‌ విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు నేడు 69వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సెలబ్రెటీలు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మోహన్‌ బాబు ప్రస్తుతం ‘సన్నాఫ్ ఇండియా’ సినిమాలో ప్రధాన పాత్ర చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రబృందం మోహన్ బాబు పోస్టర్ తో బర్త్ డే విషెస్ తెలియజేసింది. ఇక హీరో మంచు మనోజ్ విషెస్ తెలియజేస్తూ.. ‘మనందరి పెదరాయుడు గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అంటూ పోస్ట్ చేశారు. ఇక గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందే ‘శాకుంతలం’లోనూ నటిస్తున్నారు. ఇందులో దూర్వాస మహాముని పాత్రను మోహన్ బాబు పోషిస్తున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates