HomeTelugu Newsమోహన్‌లాల్‌-సత్యరాజ్‌ ‘ఇద్దరూ ఇద్దరే’!

మోహన్‌లాల్‌-సత్యరాజ్‌ ‘ఇద్దరూ ఇద్దరే’!

మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌` తమిళ టాప్‌ స్టార్‌ సత్యరాజ్‌` బ్యూటీక్వీన్‌ అమలాపాల్‌ మలయాళంలో నటించగా ఘనవిజయం సాధించిన చిత్రానికి తెలుగు  అనువాదంగా వస్తున్న చిత్రం ‘ఇద్దరూ ఇద్దరే’. జోషి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కె.ఆర్‌.ఫిలింస్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై కందల కృష్ణారెడ్డి తెలుగులో నిర్మిస్తున్నారు. ‘భలే భలే మగాడివోయ్‌’, ‘ఊపిరి’ తాజాగా ‘మజ్ను’ వంటి సూపర్‌ హిట్‌ చిత్రాల మ్యూజిక్‌ డైరెక్టర్‌ గోపిసుందర్‌ ‘ఇద్దరూ ఇద్దరే’ చిత్రానికి సంగీతం సమకూర్చారు. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం ట్రైలర్‌ను హైదరాబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్‌ ప్రివ్యూ ధియేటర్‌లో విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రసన్నకుమార్‌, బెక్కెం వేణుగోపాల్‌, లోహిత్‌, శోభారాణి, సాయివెంకట్‌ తదితర చిత్ర ప్రముఖుతోపాటు నిర్మాత కందల  కృష్ణారెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ డి.నారాయణ, ఆంధ్రా డిస్ట్రిబ్యూటర్‌ చంద్రశేఖర్‌, సురేష్‌రెడ్డి పాల్గొన్నారు.
ట్రైలర్‌ విడుదల అనంతరం వక్తలు మాట్లాడుతూ.. ‘మిర్చి’, ‘బాహుబలి’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన సత్యరాజ్‌` ‘మనమంతా’, ‘జనతా గ్యారేజ్‌’ చిత్రాలతో తెలుగులో మరింత పాపులరైన మోహన్‌లాల్‌, రాంచరణ్‌ ‘నాయక్‌ రఘువరన్‌ బి.టెక్‌, మేము’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్న అమలాపాల్‌ నటించిన అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఇద్దరూ ఇద్దరే’ తెలుగులోనూ ఘన విజయం సాధించడం ఖాయమని, గోపిసుందర్‌ మ్యూజిక్‌ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని అన్నారు.
స్వతహా నెల్లూరు డిస్ట్రిబ్యూటర్‌ అయిన తాను.. ‘ఇద్దరూ ఇద్దరే’ అనంతరం తెలుగులో స్ట్రయిట్‌ సినిమా తీసేందుకు సన్నాహాలు చేస్తున్నానని, ‘ఇద్దరూ ఇద్దరే’ చిత్రం అన్ని ఏరియాల బిజినెస్‌ ఇప్పటికే దాదాపుగా పూర్తయ్యిందని చిత్ర నిర్మాత కందల కృష్ణారెడ్డి అన్నారు.
తమ ఆహ్వానాన్ని మన్నించి కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ డి.నారాయణ కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే ఆడియో విడుదల చేసి, అక్టోబర్‌ ద్వితీయార్ధంలో సినిమా విడుదల చేయనున్నామని అన్నారు.
రమ్య నంబీసన్‌, సోనూసూద్‌, పృథ్వి తదితరులు  ఇతర ముఖ్య పాతలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: ఎస్‌.లోకనాధన్‌, ఎడిటింగ్‌: శ్యాం శశిధరన్‌, పబ్లిసిటీ డిజైనర్‌: వెంకట్‌ ఎం., మాటలు – పాటలు: రామకృష్ణ, సంగీతం: గోపిసుందర్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: డి.నారాయణ, నిర్మాత: కందల కృష్ణారెడ్డి, దర్శకత్వం: జోషి!!

Recent Articles English

Gallery

Recent Articles Telugu