HomeTelugu Newsనడిగర్ సంఘంలో పెద్ద సెలబ్రిటీ..మిస్టర్ ఫేక్ పెర్ ఫెక్ట్.. నేను నిన్ను వదలను: శ్రీరెడ్డి

నడిగర్ సంఘంలో పెద్ద సెలబ్రిటీ..మిస్టర్ ఫేక్ పెర్ ఫెక్ట్.. నేను నిన్ను వదలను: శ్రీరెడ్డి

సంచలన నటి శ్రీరెడ్డికి ఎన్నో ఆరోపణల తరువాత తమిళ సినిమా ఛాన్స్ వచ్చింది. ఆమధ్య లారెన్స్ కూడా సినిమా ఛాన్స్ ఇస్తానని చెప్పాడు. దీంతో శ్రీరెడ్డి ఇక తన ఆరోపణలు చాలిస్తుందని అంతా భావించారు. కానీ ఆమె మాత్రం అస్సలు తగ్గడం లేదు. తాజాగా మరో తమిళ స్టార్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు ఎక్కుపెట్టింది. “నడిగర్ సంఘంలో మరో పెద్ద సెలబ్రిటీ ఉన్నాడు. తన కామవాంఛల కోసం హీరోయిన్లనే కాదు, సైడ్ యాక్టర్లను కూడా వదలడు. మీడియా ముందు మాత్రం చాలా తెలివిగా మాట్లాడతాడు. ఈరోజు కూడా నేను అతడ్ని చూశాను. ఒకటి గుర్తుంచుకో మిస్టర్ ఫేక్ పెర్ ఫెక్ట్.. నేను నిన్ను వదలను.”

6 18హీరోయిన్ల జీవితాలతో ఆడుకుంటున్న ఆ వ్యక్తికి సంబంధించి కీలకమైన ఆధారాలు తన వద్ద ఉన్నాయంటోంది శ్రీరెడ్డి. అవసరమైతే మీడియా, లాయర్ల ముందు సాక్ష్యాల్ని బయటపెడతానని బెదిరిస్తోంది. “నీ సైజ్, కలర్ రెండూ నాకు తెలుసు. నా దగ్గర పక్కా ఆధారాలున్నాయి. మీడియా, లాయర్ల ముందు నేను ప్రూవ్ చేస్తాను. ఏం చేస్తావో చేస్కో. కొంత మంది హీరోయిన్లను బలవంతంగా అనుభవించి వాళ్లకు డబ్బులు ఇచ్చావు. కోలీవుడ్, నడిగర్ సంఘం, నిర్మాతల మండలిని నువ్వే పరిపాలిస్తున్నానని భావిస్తున్నావా?”

శ్రీరెడ్డి బ్యాచిలర్ గా ఉన్న ఆ ప్రముఖుడుని త్వరగా పెళ్లి చేసుకోవాలని సూచించింది. తను ఆధారాలు బయటపెట్టిన తర్వాత అతడికి పెళ్లి కూడా అవ్వదని అంటోంది. “నీ రాసలీలలు గురించి కొంతమంది నాకు చెప్పారు. పాపం కదా. ఇవన్నీ బయటపడక ముందే తొందరగా పెళ్లి చేసుకో. లేదంటే ఆమె కూడా నిన్ను వదిలి వెళ్లిపోతుంది. నువ్వు నంబర్ వన్ బ్లాక్ మెయిలర్‌వి. నీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది.”

ఇలా మరోసారి మాటల తూటాలు పేల్చింది శ్రీరెడ్డి. అయితే మొన్నటివరకు తను చేసిన ఆరోపణల్లో వ్యక్తుల పేర్లకు సంబంధించి చిన్న చిన్న క్లూస్ ఇచ్చేది శ్రీరెడ్డి. వ్యక్తుల పేర్లు మార్చి ప్రస్తావించేది. కానీ ఈసారి మాత్రం ఆ కోలీవుడ్ ప్రముఖుడి పేరును చూచాయగా ప్రస్తావించడానికి కూడా శ్రీరెడ్డి భయపడింది. శ్రీరెడ్డి ఆరోపణలు చేసిన ఆ ప్రముఖుడు ఎవరనే విషయంపై ప్రస్తుతం కోలీవుడ్ లో హాట్ టాపిక్‌గా మారింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!