HomeTelugu Trendingరామ్‌ సినిమా నదియా.. లుక్‌ విడుదల చేసిన దర్శకుడు

రామ్‌ సినిమా నదియా.. లుక్‌ విడుదల చేసిన దర్శకుడు

Nadhiya on Instagram look f
రామ్ పోతినేని తమిళ స్టార్ దర్శకుడు లింగుస్వామి డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు తమిళ భాషల్లో కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఈ బైలింగ్విల్ ని రూపొందించనున్నారు. #RAPO19 సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే హైదరాబాద్‌లో ప్రారంభం అయింది. ప్రస్తుతం హీరో రామ్ తో పాటుగా ఇతర ప్రధాన పాత్రలు పాల్గొనే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే సెట్స్‌లో రామ్ కు సంబంధించిన ఫొటోని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ క్రమంలో డైరెక్టర్‌ లింగుస్వామి ఇన్స్టాగ్రామ్ వేదికగా సీనియర్ నటి నదియా లుక్ ని విడుదల చేశారు.

#RAPO19 నుంచి బయటకు వచ్చిన ఫొటోలో నదియా పసుపు చీరలో కళ్ళద్దాలు ధరించి హుందాగా కన్పిస్తోంది. ఇందులో ఆమె పాత్కు సంబంధించిన వివరాలేవే చిత్ర బృందం వెల్లడించనప్పటికీ.. నదియా కీలక పాత్ర పోషిస్తున్నట్లు అర్థం అవుతోంది. అంతేకాదు అది రామ్ తల్లి పాత్ర అని కూడా అంటున్నారు. ప్రస్తుతం రామ్ తో పాటుగా నదియా కూడా షూట్ లో పాల్గొంటోంది. ‘మిర్చి’ సినిమాతో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చిన నదియా.. అత్తారింటికి దారేది, దృశ్యం, బ్రూస్లీ, అ ఆ, నా పేరు సూర్య, మిస్ ఇండియా వంటి చిత్రాల్లో అలరించింది. ప్రస్తుతం గని, వరుడు కావలెను చిత్రాల్లో నటిస్తున్న నదియా.. ఇటీవలే ‘దృశ్యం 2’ షూటింగ్ పూర్తి చేశారు. ఈ క్రమంలో ఇప్పుడు రామ్ చిత్రంలో నటిస్తున్నారు. కాగా #RAPO19 చిత్రానికి ”ఉస్తాద్” అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకురుస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!