నాగ్ మాటిచ్చేశాడా..?

రీసెంట్ గా నాగార్జున నిర్మాణంలో ‘నిర్మలా కాన్వెంట్’ అనే చిత్రం రూపొందింది. ఈ సినిమాలో
నాగార్జున కూడా నటించారు. ఈ సినిమా ద్వారా శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించాడు.
సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా… రోషన్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. షూటింగ్ సమయంలో
నాగార్జున సైతం రోషన్ నటన చూసి నివ్వెరపోయాడట. అయితే రోషన్ తన సినిమా జీవితానికి
రెండేళ్ళు గ్యాప్ ఇవ్వనున్నాడు. నటనలో తను మరింత పరిణితి చెందాల్సివుంది. అంతే కాదు,
డాన్స్, ఫైట్స్ విషయంలో శిక్షణ తీసుకోవాలనుకుంటున్నాడు. ఆ తరువాతే పూర్తి స్థాయిలో
హీరోగా ఎంట్రీ ఇచ్చి సినిమాలు చేయాలనుకుంటున్నాడు. అయితే అప్పుడు కూడా తనను
హీరోగా నేనే పరిచయం చేస్తానని శ్రీకాంత్ కు నాగ్ మాటిచ్చేశాడట. దీనికి శ్రీకాంత్ కూడా సమ్మతం
తెలిపినట్లు తెలుస్తోంది.

CLICK HERE!! For the aha Latest Updates