ప్రారంభమైన బిగ్‌బాస్‌ గ్రాండ్‌ ఫినాలే.. తన స్టెప్‌లతో అదరగొట్టిన నాని

తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బిగ్‌బాస్‌-2 పైనల్ ఎపిసోడ్ రానే వచ్చేసింది. 113 రోజులు.. 18 మంది కంటెస్టెంట్స్‌, ఐదుగురు ఫైనలిస్ట్‌లతో గ్రాండ్ ఫినాలే గ్రాండ్‌గా ఆరంభమైంది. నాని ఆకాశంలోనుంచి స్టేజ్‌పైకి దిగుతున్నట్టుగా డాన్సర్లతో స్టెప్పులు వేస్తూ గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ప్రతిరోజూ శని, ఆదివారాలు మీతో సరదాగా గడిపేందుకు వచ్చేవాడిని. ప్రతి ఆదివారం ఒకరు హౌస్‌నుంచి ఎలిమినేట్ అయ్యేవారు. ఇప్పుడు నా గుండె బరువెక్కిపోయింది. ఇప్పుడు మీ అందరి నుంచి దూరమౌతున్నాము. ఇకనుంచి మా టీవీలో నాని టీవీ రాదు. మాటీమ్‌ అందరూ మీకు ఎంతో రుణపడి ఉంటామంటూ నాని తన షోను ప్రారంభించాడు.

బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌ కుటుంబ సభ్యులు ఫైనల్ ఎపిసోడ్‌కు హాజరయ్యారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేశాడు నాని. ముందుగా గీతా మాధురి తల్లితో మాట్లాడించగా బిగ్‌బాస్ హౌస్లో ఉన్నప్పటికీ మా ఇంటిలో ఉన్నప్పటికీ తేడా ఏమీ లేదు. చాలా హ్యాపీగా ఉంది అంటూ గీతామాధురి తల్లి సమాధానమిచ్చారు. సామ్రాట్ బిగ్‌బాస్ హౌస్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుకున్నాడని తండ్రి చెప్పారు. తనీష్ తల్లి బాధపడుతూ తన తండ్రి సంవత్సరికం రోజునే బిగ్‌బాస్‌లోకి రావాలని కాల్ వచ్చింది. వెళ్లాలా వద్దా అని ఆలోచించుకోమని చెప్పానని అన్నారు. కౌశల్‌ భార్యతో నాని మాట్లాడుతూ ఆన్‌స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ డ్రామాలు మీకు ఎలా అనిపించాయని అనగా తనకు మంచి ఫ్లాట్‌ఫామ్ దొరికింది అన్నారు.