HomeTelugu Trending'అశ్వథ్థామ' యాక్షన్‌ వీడియో..

‘అశ్వథ్థామ’ యాక్షన్‌ వీడియో..

3 25
హీరో నాగశౌర్య ఇప్పుడు యాక్షన్‌ సన్నివేశాలతో అదరగొడుతున్నాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘అశ్వథ్థామ’. ఈ చిత్రానికి రమణ తేజ దర్శకత్వం వహిస్తున్నారు. మెహరీన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జనవరి 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి యాక్షన్‌ మేకింగ్‌ వీడియోను చిత్ర బృందం అభిమానులతో పంచుకుంది. ఇంతకుముందెన్నడూ చూడని రీతిలో నాగశౌర్య యాక్షన్‌ సన్నివేశాల్లో అదరగొట్టాడు.

తాజాగా ఈ సినిమా సెన్సార్‌ను కూడా పూర్తి చేసుకుంది. యూ/ఏ సర్టిఫికెట్‌ వచ్చింది. యాక్షన్‌ సన్నివేశాలు మరోస్థాయిలో ఉన్నాయని సెన్సార్‌ బోర్డు సభ్యులు ప్రశంసించినట్లు చిత్ర బృందం తెలిపింది. శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందించిన ఈ సినిమాను ఐరా క్రియేషన్స్‌పతాకంపై ఉష మూల్పూరి నిర్మిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu