HomeTelugu Big Storiesసాయి పల్లవితో వరుణ్‌ తేజ్‌ పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన నాగబాబు

సాయి పల్లవితో వరుణ్‌ తేజ్‌ పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన నాగబాబు

Nagababu clarifies about v
మెగా బ్రదర్‌ నాగబాబు గతేడాది తన ముద్దుల కూతురు నిహారిక పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. నిహారిక మ్యారేజ్ తర్వాత నాగబాబు తన తనయుడు వరుణ్ తేజ్ పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు. పెళ్లి కూతురును వెతికే పనిలో పడ్డాడు. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నాగబాబు తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో చిట్‌చాట్ చేశాడు. ఈ సందర్భంగా ఓ అభిమాని మాట్లాడుతూ.. వరుణ్ తేజ్‌కు హీరోయిన్ సాయి పల్లవితో పెళ్లి చేస్తే బాగుంటుందని నాగబాబుకి సలహా ఇచ్చాడు. నెటిజన్ అలా చెప్పడంతో నాగబాబు తనదైన స్టైల్‌లో స్పందించాడు. జాతి రత్నాలు సినిమాలో క్లైమాక్స్‌లో వచ్చే కోర్టు సీన్ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో జడ్జ్ గా ఉన్న బ్రహ్మానందం “తీర్పు మీరు మీరు చెప్పుకోండ్రా. ఇక నేనేందుకు ఇక్కడి నుంచి వెళ్లిపోతాలే” అనే డైలాగ్ చెబుతాడు. దీంతో ఈ పోస్ట్ ఒక్కసారిగా వైరల్ అయ్యింది.

కాగా నాగబాబు ఇక్కడికే వరుణ్ తేజ్ పెళ్లిపై పలుమార్లు స్పందించారు. అంతేకాదు వరుణ్ కు మంచి అమ్మాయిని చూడమంటూ మెగా అభిమానులకు సలహా కూడా ఇచ్చాడు. అయితే వరుణ్ తేజ్ ఇప్పుడే పెళ్లి వద్దని అంటున్నాడని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు నాగబాబు. అప్పటి నుంచి వరుణ్ ఓ హీరోయిన్ తో లవ్ లో ఉన్నాడనే రూమర్లు స్టార్ట్ అయ్యాయి. కానీ మెగా ఫ్యామిలీ వాటిని పట్టించుకోలేదు. తాజాగా వరుణ్ పెళ్లి విషయం మరోమారు హాట్ టాపిక్ అయ్యింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!