బాలయ్య టైటిల్ ఇదేనా..?

బాలకృష్ణ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ఇప్పటికే మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉండబోతున్నారు. అందులో ఒకర్ని బాలీవుడ్ నుండి రంగంలోకి దింపారు. ఆమె పేరు ముస్కాన్. అలానే మరో ఇద్దరు హీరోయిన్స్ ను సెలెక్ట్ చేయనున్నారు. అయితే ఇప్పుడు సినిమా కోసం పూరీ టైటిల్ ను కూడా ఫిక్స్ చేశాడని చెబుతున్నారు. అదే ‘ఉస్తాద్’.

ఈ సినిమాలో బాలయ్య గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నాడు. కథకు తగ్గట్లుగా ఉస్తాద్ అనే టైటిల్ సెట్ అవుతుందని ఆయన భావిస్తున్నారు. హీరోయిన్స్ ను ఫైనల్ చేసి వారి పేర్లతో పాటు టైటిల్ ను కూడా అనౌన్స్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఏప్రిల్ మొదటి వారం నుండి సినిమా రెండో షెడ్యూల్ మొదలుకానుంది. మరి ఉస్తాద్ గా బాలయ్య మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి!