HomeTelugu Trendingకింగ్ కాదు.. కేవలం హీరోనే.. బాలయ్యకు నాగబాబు వార్నింగ్‌!

కింగ్ కాదు.. కేవలం హీరోనే.. బాలయ్యకు నాగబాబు వార్నింగ్‌!

8 27
మెగా పవర్‌ స్టార్‌ చిరంజీవి నివాసంలో సినిమాటోగ్రాఫర్ తలసాని ఆధ్వర్యంలో పెద్దలంతా కలిసి ఇటీవలే మీటింగ్ పెట్టారు. సినిమా ఇండస్ట్రీలో సమస్యలు, షూటింగ్ లకు అనుమతులు వంటి వాటిపై చర్చించారు. ఆ మీటింగ్‌కు బాలకృష్ణ తప్ప మిగతా వాళ్ళు హాజరయ్యారు. బాలయ్య దీనిపై స్పందించాడు. కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు ఇండస్ట్రీలో వివాదం మారాయి. తాజాగా బాలయ్య వ్యాఖ్యలపై నాగబాబు స్పందించారు.

బాలయ్య నోరు అదుపులో పెట్టుకోవాలని నాగబాబు వార్నింగ్ ఇస్తున్నట్టు మాట్లాడాడు. బాలయ్య వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని అన్నాడు. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడటం సరికాదని, బాలయ్య మాట్లాడింది చాల తప్పు అని నాగబాబు పేర్కొన్నాడు. బాలయ్య మాటలు పరిశ్రమనే కాకుండా, తెలంగాణ ప్రభుత్వాన్ని అవమానపరిచే విధంగా ఉన్నాయని నాగబాబు అన్నాడు. ప్రభుత్వం, పరిశ్రమకు బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలని నాగబాబు డిమాండ్ చేశాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎవరు చేశారో ఒక్కసారి ఏపీకి వెళ్తే తెలుస్తుందని అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఏపీని ఎవరు సర్వనాశనం చేశారని ప్రశ్నించాడు. బాలకృష్ణ ఏం మాట్లాడినా నోరుమూసుకుని కూర్చోబోమని, ఇండస్ట్రీకి బాలకృష్ణ కింగ్ కాదు.. కేవలం హీరోనే అని నాగబాబు పేర్కొన్నారు. బాలయ్యపై నాగబాబు హాట్ కామెంట్స్ చేయడంతో ఇండస్ట్రీ వేడెక్కింది. ఈ వివాదం ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!