‘దేవదాస్‌’ నుంచి వినాయక చవితి స్పెషల్‌ సాంగ్‌

కింగ్ నాగార్జున, యంగ్ హీరో నాని హీరోలుగా క్రేజీ మల్టీస్టారర్‌ మూవీ ‘దేవదాస్’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కాగా వినాయక చవితిని పురస్కరించుకొని దేవదాస్ సినిమాలోని మూడో సింగిల్ సాంగ్ లకలక లకుమీకర సాంగ్ ను ఈరోజు ఉదయం రిలీజ్ చేశారు. లకలకలకుమీకర అనే పల్లవితో సాగే ఈ సాంగ్ ట్యూన్ రెగ్యులర్ బీట్ లా ఉన్నప్పటికీ లిరిక్స్ మాత్రం ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. చిన్న చిన్న పదాలతో మంచి ప్రయోగం చేశారు రామజోగయ్య శాస్త్రి. రకరక రూపాలు నీవేనురా అంటూ పాటను సాగించిన విధానం బాగుంది.

వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాను యువ దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. మణిశర్మ సంగీత దర్శకత్వం అందిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న, ఆకాంక్ష సింగ్‌లు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సెప్టెంబర్ 27న రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.