HomeTelugu Trendingరాధే శ్యామ్‌: నగుమోము తారలే.. సాంగ్‌ ప్రోమో విడుదల

రాధే శ్యామ్‌: నగుమోము తారలే.. సాంగ్‌ ప్రోమో విడుదల

Nagumomu Thaarale song Teas
పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘రాధే శ్యామ్’. రాధాకృష్ణ డైరెక్షన్‌లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ల జోరును పెంచేశారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి రెండో సింగిల్ ” నగుమోము తారలే” అంటూ సాగే పాటను విడుదలైంది.

తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో జస్టిన్ ప్రభాకర్ సంగీతం అందించిన ఈ పాటకు కృష్ణ కాంత్ లిరిక్స్ సమకూర్చగా సిద్ శ్రీరామ్ ఆలపించారు. ఇక ఈ చిన్న టీజర్ లో లిరిక్స్ లేకుండా మ్యూజిక్ తోనే పూజా, ప్రభాస్ ల మధ్య ప్రేమ గాఢతను చూపించారు. వర్షంలో పూజ కోసం బైక్ పై ప్రభాస్ వెయిట్ చేయడం, సముద్ర తీరాన ప్రభాస్ క్లాస్ లుక్ లో నడుచుకు రావడం, అందమైన లొకేషన్స్ లో హీరోహీరోయిన్ల మధ్య రొమాన్స్ ని ఎంతో అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ పాట ఫుల్ సాంగ్ ని డిసెంబర్ 1 న రిలీజ్‌ చేయన్నున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu