‘జెర్సీ’ అతిథి ఆ స్టార్‌ హీరోనా!

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటిస్తున్న ‘జెర్సీ’ సినిమా పాజిటివ్ బజ్ ను క్రియేట్ చేసుకుంది. ట్రైలర్ తరువాత ఈ సినిమాకు మరింత హైప్ క్రియేట్ అయ్యింది. క్రికెట్ నేపధ్యం కలిగి ఉండటంతో పాటు… ఫెయిల్యూర్ అయినా ఓ యువకుడు తండ్రిగా మారిన తరువాత ఎలా తిరిగి సక్సెస్ అయ్యాడు అనే కథాంశంతో తెరకెక్కింది. ఈ సినిమాపై అంచనాలు కూడా అలాగే ఉన్నాయి. ఇటీవల కాలంలో ఫెయిల్యూర్ స్టోరీస్ కు మంచి డిమాండ్ ఉండటంతో… ఇలాంటి కథలతోనే సినిమాలు వస్తున్నాయి.

జెర్సీ సినిమా ఏప్రిల్ 19 వ తేదీన విడుదల కాబోతున్నది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిబ్రవరి 15 వ తేదీన శిల్పకళా వేదికలో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. చీఫ్ గెస్ట్ గా వెంకటేష్ వస్తుండటం విశేషం. క్రికెట్ ప్రాధాన్యత కలిగిన సినిమా కావడంతో వెంకటేష్ ను పిలిచి ఉంటారు. అంతేకాకుండా రీసెంట్ గా రిలీజైన మజిలీ సినిమాకు కూడా వెంకటేష్ చీఫ్ గెస్ట్ గా రావడంతో ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సెంటిమెంట్ తోనే జెర్సీ సినిమాకు కూడా వెంకటేష్ ను ఆహ్వానించి ఉంటారు.