నానితో మరోసారి రొమాన్స్ చేయనుంది!

‘జెంటిల్ మన్’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయిన బ్యూటీ నివేదా థామస్. మొదటి
చిత్రంతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసింది. ఆ తరువాత నివేదాకు ఎన్ని ఆఫర్స్ వచ్చినా..
అమ్మడు మాత్రం ఆచితూచి అడుగులు వేస్తోంది. కథల విషయంలో చాలా జాగ్రత్తలు
తీసుకుంటోంది. జెంటిల్ మన్ సినిమాలో నాని, నివేదా కాంబినేషన్ సీన్స్ కు ప్రేక్షకుల నుండి
మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ జంటను మరోసారి తెరపై చూపించడానికి దర్శకనిర్మాతలు
ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ‘నేను లోకల్’ చిత్రంలో నటిస్తోన్న నాని, ఆ తరువాత శివ అనే
దర్శకుడు రూపొందించనున్న సినిమాలో నటించనున్నాడు. ఈ చిత్రాన్ని డివివి దానయ్య
నిర్మించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా నివేదాను సెలెక్ట్ చేశారనే మాటలు బలంగా
వినిపిస్తున్నాయి. అలానే అఖిల్ తదుపరి సినిమాలో కూడా నివేదాను ఎన్నుకోవాలనే
ఆలోచనలో ఉన్నట్లు టాక్.

CLICK HERE!! For the aha Latest Updates