తనీష్ బయటకు పంపిస్తా.. కౌశల్‌ని టచ్‌ చేసిచుడూ!

తెలుగు బిగ్ బాస్ సీజన్-2 మరో వారం మాత్రమే మిగిలి ఉన్న సంగతి తెలిసిందే. హౌస్‌ మేట్స్ కు కౌషల్ కి మధ్య జరిగినవార్ గురించి శనివారం ఎపిసోడ్‌లో నాని అందరికి క్లాస్‌ పీకాడు. అయితే గత ఎపిసోడ్‌లో కౌశల్ పొరపాటున ఇంటిసభ్యులను కుక్కల్లా మీద పడిపోతున్నారు అని అనడంతో వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. అప్పుడు తనీష్ ఇక్కడ కాబట్టి ఊరుకున్నా.. అదే బయట అయితే వేరేలా ఉండేది అని అన్నాడు.

ఈ విషయం పై శనివారం ఎపిసోడ్‌లో తనీష్‌ పై నాని ఫైర్‌ అయ్యాడు. నాని తనిష్‌ తో.. ఇప్పుడే నిన్ను, కౌశల్‌ని బయటకు పంపిస్తా. టచ్ చేయి చూద్ధాం అని అన్నాడు. ఇది బిగ్‌బాస్‌ హౌస్‌ కాబట్టి సరిపొయింది. అదే బయట అయితే పోలీస్‌ స్టేషన్‌లో పడేస్తారు అన్నాడు. నీకు టెంపర్ తగ్గించుకోమని మొదటి నుండే చెబుతున్నాను. అయినా నీ ప్రవర్తన మారలేదు అని తనీష్‌కు చురకలు అంటించాడు నాని. అదేవిధంగా కౌశల్ వ్యాఖ్యలనూ తప్పుబట్టిన నాని.. అందరికి ఎంతో మర్యాదనిచ్చే నువ్వు కూడా అలా అనే సరికి నేను షాక్ అయ్యానన్నాడు. అయితే ఈ రోజు (ఆదివారం) ఎవరు ఎలిమినేషన్ అవుతారనేది ఆసక్తి రేపుతోంది.. కాగా ఈ రోజు రోల్‌ ఎలిమినేట్‌ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది.