మైత్రీ మూవీ మేకర్స్ నాని 28వ చిత్రం


నేచురల్‌ స్టార్‌ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘టక్ జగదీష్’. శివ నిర్వాణ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా షూటింగ్‌ను తాజాగా కరోనా నియమ నిబంధనల అనుగుణంగా ప్రారంభించారు. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌లో నాని పాల్గొంటున్నాడు. మరోవైపు నాని తన 27వ సినిమాగా ‘శ్యామ్ సింగరాయ్’ చేస్తున్నాడు. కాగా నాని నిన్న ‘ష్.. ఎవరికీ చెప్పొద్దు’ రేపు మంచి రోజట.. రేపు మాట్లాడుకుందాం అంటూ ట్వీట్ చేశారు. ఈ సినిమా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో నాని 28వ సినిమాగా తెరకెక్కనుంది. దీపావళి సందర్బంగా నాని మైత్రి మూవీ మేకర్స్ ల కాంబో దర్శకుడు ఎవరు అనే విషయమై క్లారిటీ ఇవ్వబోతున్నాడు.

CLICK HERE!! For the aha Latest Updates