పవన్ కు పోటీగా నాని!

నాని హీరోగా వేణుశ్రీరామ్ దర్శకత్వంలో ‘ఎంసిఏ’ అనే సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 21న రిలీజ్ ఫిక్స్ చేశారు. అయితే అదే టైంకు అఖిల్ సెకండ్ మూవీ హలో వస్తుండటంతో డిసెంబర్ 15కి ప్రీ పోన్ చేశారని సమాచారం. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా దిల్ రాజు ఎంసిఏ రిలీజ్ ను మళ్లీ పోస్ట్ పోన్ చేశారని అంటున్నారు. సంక్రాంతి బరిలో ఎంసిఏ ను దించాలని చూస్తున్నాడట. ఎలాగు నాచురల్ స్టార్ సినిమా అంటే యూత్ లో ఫాలోయింగ్ ఏర్పడింది.

అందులో భాగంగా సినిమాకు పోటీగా పవన్, బాలకృష్ణ, రవితేజలు వస్తున్నా తన మార్కెట్ తనదే అంటూ నాని ఈ డేర్ స్టెప్
వేస్తున్నాడట. ముఖ్యంగా పొంగల్ వార్ లో నాని సినిమా ఉండేలా దిల్ రాజు తెగింపు ప్రదర్శిస్తున్నాడట.పవన్ సినిమాకు పోటీగా నాని రావడం రిస్క్ అని తెలుస్తున్నా సినిమా మీద ఉన్న నమ్మకంతోనే నాని దిల్ రాజు ఈ స్టెప్ తీసుకుంటున్నారు.