‘నన్నుదోచుకుందువటే’ ట్విట్టర్‌ రివ్యూ

యంగ్‌ హీరో సుదీర్ బాబు హీరోగా నటిస్తూ.. నిర్మించిన చిత్రం ‘నన్నుదోచుకుందువటే’. ఈ సినిమా ఈరోజు రీలీజ్ అయింది. యూఎస్ లో ఇప్పటికే ప్రీమియర్ షోలు ముగిశాయి. ఈ షో చూసిన యూఎస్ ప్రేక్షకులు దీని గురించి ట్విట్టర్ లో తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. సుదీర్ బాబు నటన బాగుందని, చాలా డీసెంట్ గా సినిమా ఉందని అంటున్నారు. కన్నడ భామ నభా నటేష్ అద్భుతంగా నటించిందని అంటున్నారు.

కథ విషయానికి వస్తే.. సుదీర్ బాబు ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో మేనేజర్ గా పనిచేస్తుంటారు. పని విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. స్టాఫ్ అంతా తనలాగే స్ట్రిక్ట్ గా ఉండాలని కోరుకుంటాడు. ఈ సమయంలో హీరోయిన్ నభా నటేష్ తారసపడింది. ఈమె షార్ట్ ఫిలిం హీరోయిన్. సుదీర్ బాబు ఆమెను చూడగానే ఇష్టపడతాడు. తనను ప్రేమించాలంటే.. షార్ట్ ఫిల్మ్లో యాక్ట్ చేయాలని కోరుతుంది. ఆ తరువాత ఏం జరిగింది అన్నది మిగతా కథ అంట.

కొత్త దర్శకుడు ఆర్ఎస్ నాయుడు తెరకెక్కించిన విధానం బాగుందని నెటిజన్లు అంటున్నారు. మరి పూర్తి స్థాయిలో సినిమా ఎలా ఉందొ తెలియాలంటే.. పూర్తి వివరాలు రివ్యూలో చూడాలి.