HomeTelugu News'కాలా' ట్రైలర్‌ వచ్చేసింది

‘కాలా’ ట్రైలర్‌ వచ్చేసింది

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ అభిమానులు ఎదురుచూస్తున్న”కాలా” ట్రైలర్ వచ్చేసింది. తలైవా కథనాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘కాలా’ . ఈ చిత్రానికి రంజిత్‌ దర్శకుడిగా. ధనుష్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా తమిళ ట్రైలర్‌ను చిత్ర బృందం సోమవారం సాయంత్రం విడుదల చేసింది. రజనీ తనదైన స్టెల్‌లో డైలాగ్‌ డెలివరీతో ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో ముంబయిలో తమిళవాసుల కోసం పోరాడే నాయకుడిగా రజనీ పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపించారు.

8 1

‘కాలా అంటే ఎవరు?’అంటూ ఓ పాప ప్రశ్నించగా..’రావణ్‌’ అని నానా పటేకర్‌ సమాధానం చెబుతూ కనిపించారు. ఈ ప్రచార చిత్రంలో రజనీ తన భార్యకు ‘ఐ లవ్‌ యూ’ చెప్పే తీరు..ఆమె రియాక్షన్‌ చాలా సరదాగా అనిపిస్తుంది. ఈ ట్రైలర్‌ ముగింపులో ‘మన దేహమే ఒక ఆయుధం ఇది ప్రపంచానికి తెలియాలి..ప్రజలారా కదిలిరండి’ అంటూ తలైవా పిలుపునివ్వడం హైలైట్‌గా నిలిచింది.

9

ఆద్యంతం ఆసక్తికరంగా రూపొందించిన ఈ ట్రైలర్‌ యూట్యూబ్‌లో కొత్త రికార్డు సృష్టించేలా కనిపిస్తోంది. ఇది విడుదలైన 15 నిమిషాల్లోనే 1.3 లక్షల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. 18,000 లైక్‌లు వచ్చాయి. ‘కాలా’లో రజనీ భార్యగా ఈశ్వరీరావు నటించారు. బాలీవుడ్‌ నటి హుమా ఖురేషీ ప్రధాన పాత్ర పోషించారు సంతోష్‌ నారాయణన్‌ బాణీలు అందించారు. జులై 7న ఈ సినిమా విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu