ప్రభాస్‌ గెస్ట్‌హౌస్‌ సీజ్‌

ప్రముఖ హీరో ప్రభాస్‌ గెస్ట్‌హౌస్‌ను శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు సోమవారం సీజ్‌ చేశారు. ఇటీవల రాయదుర్గం పాయేగా సర్వే నంబర్‌ 46లోని స్థలం ప్రభుత్వ స్థలం గా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ సర్వే నంబర్‌లో 84.30 ఎకరాల స్థలం ఉన్నట్లు తెలిసింది. ఇందులో 2,200 గజాల్లో ప్రభాస్‌ గెస్ట్‌హౌస్‌ను నిర్మించారు. దీన్ని జీవోనంబర్‌ 59 కింద రెగ్యులరైజ్‌ చేయాలని కోరుతూ దర ఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ స్థలమంతా ప్రభుత్వ స్థలంగా గుర్తించడంతో ఈ స్థలంలో నిర్మాణం చేసిన గెస్ట్‌హౌస్‌ను సీజ్‌ చేసినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు.