HomeTelugu Big Storiesబాధపడి ఏడ్చేలోపే, ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి: నాని

బాధపడి ఏడ్చేలోపే, ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి: నాని

‘కేరాఫ్‌ కంచరపాలెం’ చిత్రం గురించి నేచురల్‌ స్టార్‌ నాని తాజాగా ఓ ట్వీట్‌ చేశారు. ‘చక్కటి చిత్రం ‘కేరాఫ్‌ కంచరపాలెం’ థియేటర్లలో ఆడుతోంది. దయచేసి ఈ సినిమాను మిస్‌ కాకండి. ఈ చిత్రం గురించి చాలా చెప్పాలి. కానీ ట్వీట్‌, పోస్ట్‌ ద్వారా నా మనసులోని మాటల్ని పూర్తిగా చెప్పలేను’ అంటూ ఆయన వీడియో లింక్‌ను పోస్ట్‌ చేశారు. అందులో ఆయన సినిమా గురించి తన అభిప్రాయం పంచుకున్నారు.

6 8

కేరాఫ్‌ కంచరపాలెం సినిమా ప్రత్యేక షో వేస్తున్నాం.. చూస్తారా? అని అడిగారు. నా స్నేహితులు కూడా చూసి బాగుంది అన్నారు. కానీ నాకు డేట్స్‌ కుదరక, పనులు ఉండి వెళ్లలేకపోయాను. సినిమా బాగుంటుంది అని తెలిసే మొన్న వెళ్లా. కానీ చిత్రం నా అంచనాల్ని వందరెట్లు మించి ఉంది. ఎప్పుడో చిన్నతనంలో ‘మాతృదేవోభవ’ లాంటి సినిమాలు చేసినప్పుడు ఏడ్చాం. కొన్ని సందర్భాల్లో సన్నివేశాన్ని చూసినప్పుడు బాధపడి ఏడుస్తుంటాం. కానీ తొలిసారి.. ఈ సినిమా చూస్తున్నప్పుడు బాధపడి ఏడ్చేలోపే, ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి. ఇలాంటి అనుభవం నా జీవితంలో నాకు ఎప్పుడూ లేదు.

థియేటర్‌ నుంచి బయటికి వచ్చాక ఈ సినిమా గురించి ప్రేక్షకులకు ఎలా చెప్పాలి? అని ఆలోచించా. సినిమా అలాంటి ప్రభావం నాపై చూపించింది. ఇందులోని ఓ పాత్రను నేను చేసుంటే బాగుండు..! అనిపించింది. మళ్లీ.. నేను ఇందులో ఉంటే సినిమా చెడిపోయి ఉండేది అనిపించింది. నేనే కాదు.. తెలిసిన ఏ నటుడు ఉన్నా సినిమా మరోలా ఉండేది. తెలుగుదనాన్ని ఇందులో చాలా బాగా చూపించారు. తెలుగుదనం అంటే నాకు గుర్తొచ్చే ఒకేఒక్క సినిమా ‘సీతారామయ్యగారి మనవరాలు’. ఇప్పుడు దాని తర్వాత ‘కేరాఫ్‌ కంచరపాలెం’. మొత్తం చిత్ర బృందం అద్భుతంగా పనిచేశారు…’ అంటూ నాని వీడియోలో పేర్కొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!