HomeTelugu Trendingవరుణ్‌ తేజ్‌కు విలన్‌గా యంగ్ హీరో

వరుణ్‌ తేజ్‌కు విలన్‌గా యంగ్ హీరో

2 27
మెగా హీరో వరుణ్ తేజ్ తాజా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో వరుణ్ బాక్సర్ గా కనిపించబోతున్నాడు. కాగా సినిమాలో విలన్ గా నవీన్ చంద్రను ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. అందాల రాక్షసి ‘ సినిమాతో హీరోగా ఏంట్రీ ఇచ్చిన నటుడు నవీన్ చంద్ర. ఈ సినిమాలో నవీన్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. కాగా నాని నటించిన ‘నేను లోకల్ ‘ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించాడు నవీన్. ఆ తర్వాత హీరోగా సినిమాలు చేస్తూనే నటనకు ప్రాధాన్యత ఉన్న విలన్‌గా నటించాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అరవింద సామెత వీరరాఘవ’ సినిమాలో కూడా ఎన్టీఆర్ కు విలన్ గా నవీన్ నటించిన విషయం తెలిసిందే. తాజాగా ఒక తమిళ స్టార్ హీరో సినిమాలో కూడా విలన్‌గా నటించాడు. ఇక వరుణ్‌ తేజ్‌ సినిమాలో విలన్‌గా నవీన్ చంద్ర ఎలా మెప్పిస్తాడో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu