
స్టార్ హీరోయిన్ నయనతార, డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ జంట శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకుని, స్వామివారి కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వీరికి ఆశీర్వవచనాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. నిన్న మహాబలిపురంలోని ఓ ఖరీదైన రిసార్టులో వీరి వివాహం వైభవంగా జరిగింది. సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు వీరి వివాహానికి విచ్చేశారు. వివాహానంతరం ఈరోజు వీరు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వావి వారి దర్శనార్థం వచ్చారు. ఈ జంటను చూసేందుకు ఆలయ ఆవరణలోకి భక్తులు భారీగా తరలివచ్చారు.













