ఈ లుక్స్ ఏంటి పవన్..?

పవన్ కల్యాణ్, డాలీ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘కాటమరాయుడు’. రాయసీమ బ్యాక్ డ్రాప్ నడిచే ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి వచ్చే ఏడాది ఉగాది కానుకగా సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టేశారు. ఇందులో భాగంలో సినిమాకుసంబంధించి రోజుకో ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తున్నారు. రీసెంట్ గా రెండు కొత్త పోస్టర్లు బయటకి వచ్చాయి. పవన్ పోస్టర్ అంటే ఆయన కొత్త లుక్, స్టయిల్ చూడాలని అభిమానులు ఆశ పడుతుంటారు. కానీ ఈ రెండు పోస్టర్లు వాటికి విరుద్ధంగా ఉన్నాయి.

పవన్ మొహాన్ని దాచేస్తూ.. కేవలం అతడి కాళ్ళు, చెప్పులు చూపిస్తూ మొదటి పోస్టర్ ను విడుదల చేశారు. పోనీ రెండో పోస్టర్ లో అయినా.. పవన్ మొహాన్ని చూపిస్తారనుకుంటే అదీ లేదు. రెండో పోస్టర్ లో కూడా కాళ్ళు.. చెప్పులే.. ఇది కాటమరాయుడు సినిమా ప్రమోషనా..? లేక హవాయ్, పారాగన్ చెప్పుల ప్రమోషనా..? అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కనీసం కొత్తగా విడుదల చేయబోయే పోస్టర్స్ విషయంలో అయినా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.