HomeTelugu News'నేనోరకం' పాటలు విడుదల!

‘నేనోరకం’ పాటలు విడుదల!

రామ్ శంకర్ హీరోగా శరత్ కుమార్ ఓ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘నేనోరకం’. సుదర్శన్ సలేంద్ర దర్శకత్వంలో వంశీదర్ రెడ్డి సమర్పణలో శ్రీకాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహిత్ నారాయణ్ కంపోజ్ చేసిన ఈ సినిమాలోని సాంగ్స్ ను పూరి జగన్నాథ్, దేవిశ్రీ ప్రసాద్, గోపిచంద్ ఒక్కొ పాటను ఆవిష్కరించి చిత్ర యూనిట్ కు విషెష్ ను తెలిపారు. మార్చి 17 న సినిమా విడుదలకు సిద్దమవుతోంది.
ఈ సందర్బంగా..
గోపిచంద్ మాట్లాడుతూ.. ”నేనోరకం ట్రైలర్ సూబర్బ్ గా ఉంది. పాటలు చాలా బాగున్నాయి. ఈ ఇయర్ లో ఓ మంచి సినిమా గా నిలుస్తుందని” ఆశిస్తున్నానన్నారు.
పూరీ జగన్నాధ్ మాట్లాడుతూ.. ”నేనోరకం సినిమా నేను చూశాను. సినిమా కధనం చాలా గ్రిప్పింగ్ గా ఉంది. రామ్ శంకర్ కు హిట్ గ్యారెంటీ అన్న నమ్మకం వచ్చింది. పాటలన్ని సందర్బానుసారంగా బాగున్నాయన్నారు”. 
దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ.. ”నేనోరకం టైటిల్ కు తగ్గట్టుగానే పాటలు, ట్రైలర్ ప్రత్యేకంగా ఉన్నాయి. సినిమా సక్సెస్ పై టీమ్ కాన్ఫెడెంట్ గా ఉన్నారు” అన్నారు.
రామ్ శంకర్ మాట్లాడుతూ.. ”థ్రిలింగ్ లవ్ కమ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించబడిన చిత్రం నేనోరకం. సమకాలీన అంశాల స్పూర్తితో పక్కా కమర్షియల్ ఫార్మాట్ లో దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారన్నారు”. దర్శకుడు సుదర్శన్ మాట్లాడుతూ.. ”మహిత్ పాటలు, రీరికార్డింగ్ నేనోరకం సినిమాకు ఓ ఎసెట్. కంటెంట్ ఈ చిత్రానికి ప్రధాన బలం. టెక్నికల్ గా కూడా ది బెస్ట్ మూవీ ఇది. శరత్ కుమార్ కేవలం కధ నచ్చి ఈ సినిమాను చేశారు. ప్రేక్షకులకు ఓ సరికొత్త ఫీల్ ను అందిస్తుందన్నారు”.
 
 
 
 

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!