HomeOTTJack OTT release డేట్ బయటపెట్టిన నెట్ ఫ్లిక్స్

Jack OTT release డేట్ బయటపెట్టిన నెట్ ఫ్లిక్స్

Netflix announces Jack OTT release date
Netflix announces Jack OTT release date

Jack OTT Release Date:

సిద్ధు జొన్నలగడ్డ పేరు వినగానే “డీజే టిల్లూ”, “టిల్లూ స్క్వేర్” లాంటి హిట్ సినిమాలు గుర్తుకొస్తాయి కదా! ఆ హైప్‌లోనే వచ్చిన సినిమా “జాక్”. డిఫరెంట్ కంటెంట్‌తో, యాక్షన్ కామెడీ బేస్‌ చేసుకొని దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ తీసిన ఈ సినిమాపై అందరిలోనూ మంచి అంచనాలే ఉన్నాయి. కానీ, ఆ అంచనాలు సినిమా థియేటర్లకు వచ్చాక కాస్తా తగ్గిపోయాయి. బాక్సాఫీస్ దగ్గర “జాక్” కలెక్షన్లలో వర్కౌట్ కాకుండా, డిజాస్టర్‌గా మారిపోయింది.

అయితే ఇప్పుడు ఓటీటీలో అదృష్టం పరీక్షించుకోబోతుంది ఈ సినిమా. నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది – “జాక్” సినిమా మే 8 నుంచి స్ట్రీమింగ్‌కి రానుంది అని. థియేటర్లలో విడుదలై కచ్చితంగా ఒక నెలలోపే ఓటీటీలోకి రావడం చూస్తే, మేకర్స్ కూడా త్వరగా ప్యాకప్ చేసి ఓటీటీలో లాభాలు తెచ్చుకోవాలని అనుకున్నట్లు కనిపిస్తోంది.

ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ సినిమా తెలుగు మాత్రమే కాకుండా హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ స్ట్రీమింగ్‌కు రాబోతోంది. అంటే సౌత్‌తో పాటు నార్త్ ఆడియెన్స్‌కి కూడా చేరేలా ప్లాన్ చేసినట్టు.

వైష్ణవి చైతన్య, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకి సంగీతం ఇచ్చింది అచు రాజమణి, సామ్ CS, సురేశ్ బొబ్బిలి. బీవీఎస్‌ఎన్ ప్రసాద్ గారు ఈ సినిమాను నిర్మించారు.

థియేటర్‌లో ఫెయిలైనా, ఓటీటీలో ఎలాగైనా ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటుందేమో చూడాలి!

ALSO READ: సబ్యసాచి డిజైన్ చేసిన Shah Rukh Khan MET Gala లుక్ ఎలా ఉండబోతుందో తెలుసా?

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!