HomeTelugu Trendingకార్తికేయ 'రాజావిక్రమార్క' న్యూ పోస్టర్‌

కార్తికేయ ‘రాజావిక్రమార్క’ న్యూ పోస్టర్‌

New poster from Karthikeya

టాలీవుడ్‌లో Rx100 సినిమాతో ఎంట్రి ఇచ్చాడు హీరో కార్తికేయ. ఆ తరువాత హిప్పీ, గుణ 369, 90 ML, చావు కబురు చల్లగా.. లాంటి సినిమాలతో అలరించిన ఈ హీరో ఇప్పుడు చిరంజీవి టైటిల్‌తో మరోసారి థియేటర్స్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ‘రాజావిక్రమార్క’ పేరుతో కార్తికేయ హీరోగా శ్రీ సరిపల్లి అనే కొత్త డైరెక్టర్‌ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు మంచి స్పందన తెచ్చుకోగా తాజాగా బక్రీద్ కానుకగా మరో పోస్టర్ రిలీజ్ చేశారు.

ఈ పోస్టర్‌లో కార్తికేయ ముస్లిం వేషధారణలో డిఫరెంట్ లుక్‌లో కనిపించాడు. డిఫరెంట్ స్టోరీలైన్‌తో రాబోతున్న ఈ మూవీని శ్రీ చిత్ర మూవీ మేకర్స్ బ్యానర్ ఫస్ట్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తుండగా రామారెడ్డి నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. కన్నడ స్టార్ హీరో రవిచంద్రన్ మనవరాలు తాన్య రవిచంద్రన్ హీరోయిన్‌గా నటిస్తోంది. సాయి కుమార్, తనికెళ్ళ భరణి కీలక పాత్రలు పోషిస్తున్నారు.

హై ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ ‘రాజావిక్రమార్క’ మూవీ షూటింగ్ ఫినిష్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది. అతిత్వరలో ఈ మూవీ టీజర్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇందులో కార్తికేయ ఎన్‌ఐఏ ఆఫీసర్‌గా నటిస్తున్నట్లు సమాచారం. చిరు టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాపై కార్తికేయ అభిమానులతో అంచనాలు పెట్టుకున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!