HomeTelugu Trendingనిర్భయ దోషుల ఉరికి అధికారుల కొత్త టెక్నిక్

నిర్భయ దోషుల ఉరికి అధికారుల కొత్త టెక్నిక్

11 9
నిర్భయ దోషుల ఉరికి అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయా..? రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ క్షమాభిక్ష తిరస్కరించిన వెంటనే ఉరిశిక్ష అమలు కానుందా..? నిర్భయపై దోషులు అమానవీయ చర్యకు పాల్పడిన 16న గానీ, నిర్భయ మరణించిన 29న గానీ ఉరి వేయనున్నారా ? తాజా పరిణామాలు గమనిస్తే అవుననే అనిపిస్తోంది. తీహార్ జైలు అధికారుల ఆదేశం మేరకు బక్సర్ జైలు ఉరితాళ్లు సిద్ధం చేసింది. బీహార్ నుంచి తీహార్‌కు తరలించేందుకు పది ఉరితాళ్లు తయారయ్యాయి. ఒక్కో తాడు పదహారు అడుగుల పొడవుంది. 7,200 మెత్తని దారాలతో తాడు తయారుచేశారు. 1.5 కేజీల బరువున్న తాడు ఖరీదు రూ. 2,120 అని జైలు అధికారులు చెబుతున్నారు.

దేశ విభజన ముందునుంచీ ఉరి తాళ్లను బక్సర్ జైల్లోనే తయారుచేస్తున్నారు. 2013లో అఫ్జల్ గురును ఉరితీయడానికి ఉపయోగించిన తాడును కూడా బక్సర్ జైల్లోనే తయారుచేశారు. నిర్భయపై దారుణానికి ఒడిగట్టిన ఆరుగురు దోషుల్లో ముగ్గురు ఏడేళ్ల నుంచి తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. మరో దోషి పవన్ గుప్తాను కూడా ఇటీవలే తీహార్ జైలుకు తరలించారు. జైల్లో నలుగురు దోషులను ఒకే గదిలో ఉంచుతున్నట్టు సమాచారం. మిగిలిన ఇద్దరిలో ఒకరు మైనర్ కావడంతో మూడేళ్ల శిక్ష తర్వాత జైలు నుంచి విడుదలయ్యాడు. ఓ నిందితుడు రాం సింగ్ విచారణ పూర్తికాకముందే తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు.

అక్షయ్ కుమార్ సింగ్ ఉరిశిక్షను తగ్గించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. ఈ నెల 17న ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరపనుంది. సుప్రీంకోర్టు ఉరిశిక్షను అమలుచేయాలని తీర్పు ఇస్తే దోషులు క్షమాభిక్ష కోసం రాష్ట్రపతికి విన్నవించుకుంటారు. రాష్ట్రపతి క్షమాభిక్షను తిరస్కరిస్తే రోజుల వ్యవధిలోనే నలుగురు దోషులను ఉరితీస్తారు. తాజాగా వారిని ఉరి తీసేందుకు మీరట్ జైల్లో ఉన్న తలారిని రప్పించిన అధికారులు, జైలులోని ఫాన్సీ కోట బ్యారక్ లో 1950లో ఏర్పాటు చేసిన ఉరి కొయ్యలను పరిశీలించారు. నలుగురు దోషులను ఒకేసారి వేలాడదీసి ఉరిశిక్షను అమలు చేయడం కోసం నూతన టెక్నిక్‌లను అనుసరిస్తున్నట్టు సమాచారం. ఉరికొయ్యగా ఉన్న మెటల్ బార్, నలుగురు దోషుల బరువును మోస్తుందా? అని పరిశీలించారు. మరో మెటల్ క్రాస్బార్ ను ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu