HomeTelugu Trendingపవన్‌, క్రిష్‌ సినిమాలో నిధి అగర్వాల్‌

పవన్‌, క్రిష్‌ సినిమాలో నిధి అగర్వాల్‌

6 12

హీరోయిన్‌ నిధి అగర్వాల్ టాలీవుడ్‌లో ‘మిస్టర్ మజ్ను’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. యూత్ హృదయాలను దోచేసింది. ఆ తరువాత ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. తాజాగా ఆమె మరో అవకాశాన్ని దక్కించుకుంది. క్రిష్ సినిమాలో కథానాయికగా ఆమె ఎంపిక జరిగిపోయిందని తెలుస్తోంది.

పవన్ కల్యాణ్ హీరోగా క్రిష్ ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. ఎ.ఎమ్.రత్నం నిర్మిస్తున్న ఈ సినిమాలో ఆంగ్లేయులను దోచుకునే ఒక బందిపోటుగా పవన్ కనిపించనున్నాడు. ఆయన సరసన హీరోయిన్‌ పాత్ర కోసం కైరా అద్వానీని .. పూజా హెగ్డేను .. సోనాక్షి సిన్హాను సంప్రదించారు. వాళ్ల డేట్స్ ఖాళీ లేకపోవడం వలన, నిధి అగర్వాల్ ను తీసుకున్నారు. పారితోషికం తక్కువ కావడం వల్లనే నిధి అగర్వాల్ ను తీసుకున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu