HomeTelugu Trendingరవితేజతో ఇస్మార్ట్‌ బ్యూటీ

రవితేజతో ఇస్మార్ట్‌ బ్యూటీ

9 6
హీరోయిన్‌ నిధి అగర్వాల్ టాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. మరో క్రేజీ ఆఫర్ కొట్టేసింది. పూరీ జగన్నాథ్ తీసిన ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. మాస్ మహారాజా రవితేజ సరసన నటించే అవకాశం దక్కించుకుంది. ‘రాక్షసుడు’ ఫేం రమేశ్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కబోయే కొత్త చిత్రంలో ఓ హీరోయిన్ గా నిధి అగర్వాల్‌ని ఎంచుకున్నారు. ఇందులో మరో హీరోయిన్ కు కూడా అవకాశం ఉంది. మరో హీరోయిన్‌తో పాటు ఇతర తారాగణం వివరాలను చిత్ర బృందం త్వరలో ప్రకటించనుంది. ఏ స్టూడియోస్ బ్యానర్ లో హవీష్ ప్రొడక్షన్ లో సత్యనారాయణ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రవితేజ ప్రస్తుతం ‘క్రాక్’ సినిమాతో బీజీగా ఉన్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu