HomeTelugu Big Storiesపెళ్లి కూతురిగా నిహారిక.. ఫొటో వైరల్‌

పెళ్లి కూతురిగా నిహారిక.. ఫొటో వైరల్‌

Niharika Konidela Pellikuth
మెగా డాటర్‌, నాగబాబు కూతురు నిహారిక కొణిదెల ప్రీ వెడ్డింగ్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఐజీ ఆఫీసర్ కుమారుడు చైతన్య జొన్నలగడ్డను నిహారిక పెళ్లాడుతోంది. డిసెంబర్ 9న రాజస్థాన్ ఉదయ్ పూర్ టౌన్ లో ఉదయ్ పూర్ ప్యాలెస్ లో వీరి వివాహానికి జరగనుంది. మరో నాలుగు రోజులే సమయం మిగిలి ఉంది. కొద్దిమంది బంధుమిత్రులు ఇండస్ట్రీ ప్రముఖుల సమక్షంలో ఈ వివాహం వైభవంగా జరగనుంది. మెగా హీరోలు అందరూ పెళ్లి కోసం తమ షూటింగ్‌లకు లీవ్‌ కూడా పెట్టారట. తాజాగా నిహారిక ప్రీవెడ్డింగ్ వేడుకల్లో భాగంగా పెళ్లి కూతురుగా ముస్తాబుకు సంబంధించిన ఫోటోలు అంతర్జాలంలో కి విడుదలయ్యాయి. ఈ ఫొటోలో నిహారిక పుత్తడి బొమ్మను తలపిస్తోంది. కాగా ఇప్పటికే సోషల్‌ మీడియాలో నిహారిక ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!