‘అర్జున్‌ సురవరం’గా మారిన నిఖిల్‌ కొత్త సినిమా


యంగ్‌ హీరో నిఖిల్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త సినిమా టైటిల్‌లో మార్పులు జరిగాయి. ‘ముద్ర’ టైటిల్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ, ఓ చిత్రబృందం ఇదే టైటిల్‌తో పోస్టర్‌ను డిజైన్‌ చేసుకుని సినిమాను విడుదల చేశాయి. దాంతో ఈ విషయం కాస్తా వివాదాస్పమైంది. ఈ నేపథ్యంలో సినిమా టైటిల్‌ను ‘అర్జున్‌ సురవరం’గా మారుస్తూ కొత్త పోస్టర్‌ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది.

ఈ చిత్రంలో నిఖిల్‌ అర్జున్‌ లెనిన్‌ సురవరం అనే జర్నలిస్ట్‌ పాత్రలో నటించారు. వ్యాను నుంచి నిఖిల్‌ కెమెరాతో ఓ దృశ్యాన్ని చిత్రీకరిస్తూ ఫస్ట్‌లుక్‌లో కన్పించారు. ఇందులో నిఖిల్‌కు జోడీగా లావణ్య త్రిపాఠి నటిస్తున్నారు. సంతోష్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వీఎఫ్‌ఎక్స్‌ ఎఫెక్ట్స్‌ను జోడించే నేపథ్యంలో సినిమా విడుదలను వాయిదా వేశారు. ఔరా సినిమాస్‌, మూవీ డైనమిక్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ‘ఠాగూర్‌’ మధు సమర్పిస్తున్నారు. మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.