‘మజిలీ’కి అతిథిగా వెంకటేశ్

అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా నటించిన మూవీ ‘మజిలీ’. శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కాగా.. 30న ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకను చిత్రబృందం ఘనంగా ఏర్పాటుచేయనుంది. వేడుకకు నాగచైతన్య మేనమామ విక్టరీ వెంకటేశ్‌ అతిథిగా రాబోతున్నారు. వెంకటేశ్‌, నాగచైతన్య ప్రధాన పాత్రల్లో ‘వెంకీ మామ’ అనే సినిమా తెరకెక్కబోతోంది. కాబట్టి రెండు సినిమాలకూ ప్రచారం చేసినట్లుగా ఉంటుందని వెంకీ వేడుకకు హాజరయ్యేందుకు ఒప్పుకొన్నారట. ‘మజిలీ’ చిత్రంలో దివ్యాంశా కౌశిక్‌ మరో హీరోయిన్‌గా నటించారు. ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన భార్యభర్తల అనుబంధం ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించబోతున్నారు శివ నిర్వాణ. ఇప్పటికే నాగచైతన్య, సమంత కలిసి సినిమా కోసం బాగా ప్రచారం చేస్తున్నారు. గోపీ సుందర్‌ ఈ చిత్రానికి సంగీతం అందించారు. పాటలన్నింటికీ మంచి స్పందన లభించింది. షైన్‌ స్క్రీన్‌ క్రియేషన్స్‌ బ్యానర్ సినిమాను నిర్మించింది. పెళ్లయ్యాక చై, సామ్‌ జంటగా నటించిన తొలి సినిమా కావడంతో ‘మజిలీ’ పై ప్రేక్షకుల్లో బాగా అంచనాలు ఉన్నాయి. ఏప్రిల్‌ 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.