HomeTelugu Trendingస్వయంభు కోసం సముద్ర తీరంలో నిఖిల్

స్వయంభు కోసం సముద్ర తీరంలో నిఖిల్

Nikhil Swayambhu update

కార్తికేయ2 మూవీతో పాన్ ఇండియా విజయాన్ని సొంతం చేసుకున్న యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ చేస్తున్న మరో క్రేజీ, పీరియాడిక్ మూవీ స్వయంభు. ఈ సినిమాకు సంబంధించి నిఖిల్ యుద్ధ వీరుడిగా ఫస్ట్‌లుక్ ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి నిఖిల్ కత్తిసాము చేస్తున్న వీడియో ఒకటి రిలీజ్ చేశారు.

వియత్నాంలోని సముద్ర తీరంలో నిఖిల్ కత్తి సాము ప్రాక్టీస్ చేస్తున్న ఈ వీడియోకు ప్రకృతి మాత ఆశీర్వాదానికి చిహ్నం అంటూ క్యాప్షన్ ఇచ్చారు. దీనిపై నిఖిల్ సూపర్ డెడికేషన్ అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఈ సినిమా కోసం నిఖిల్ నెలరోజులు స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు.

స్వయంభు చిత్రంలో ఓ యుద్ధ వీరుడిగా కనిపించేందుకు ఫిజికల్‌గా కూడా మేకోవర్ అవుతున్నాడు నిఖిల్. ఆయుధాలు, మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీలో శిక్షణ తీసుకోనున్నాడు. ఈ మూవీకి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. నిఖిల్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్. నిఖిల్ కెరీర్‌లో 20వ సినిమాగా ఇది రూపొందుతోంది.

కేజీఎఫ్ మూవీకి మ్యూజిక్ అందించిన రవి బస్రూర్ స్వయంభు సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ పతాకంపై భువన్, శ్రీకార్ గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు.

https://x.com/actor_Nikhil/status/1708094127752323352?s=20

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!