బాలీవుడ్ లో నిఖిల్ సినిమా..?

టాలీవుడ్ లో మంచి పేరు వచ్చిన తరువాత చాలా మంది నటీనటులు బాలీవుడ్ లో పని చేయడానికి ఆస పడుతుంటారు. ఆ జాబితాలో చాలా మంది హీరోయిన్లు ఉన్నారు. హీరోయిన్స్ తో పొలుస్తే బాలీవుడ్ కు వెళ్ళే సౌత్ హీరోల సంఖ్య చాలా తక్కువ. అయితే ఇప్పుడు ఓ యంగ్ హీరో బాలీవుడ్ కు వెళ్లడానికి రెడీగా ఉన్నాడు. విభిన్న కథలను ఎన్నుకుంటూ కెరీర్ పరంగా విజయాలను అందుకుంటున్న నిఖిల్ నటించిన ‘కేశవ’ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది.

ఈ సినిమా తరువాత నిఖిల్.. చందు మొండేటి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా తరువాత నిఖిల్ బాలీవుడ్ కు వెళ్లబోతున్నాడు. ఇటీవల బాలీవుడ్ దర్శకుడు నగేష్ కుకునూర్ ఓ ఫంక్షన్ లో నిఖిల్ ను కలిసి లైన్ వినిపించాడట. ఆ లైన్ నచ్చడంతో నిఖిల్ బాలీవుడ్ సినిమాకు రెడీ అయిపోతున్నాడు. ఈ సినిమా తెలుగు, హిందీ బాషల్లో రూపొందనున్నట్లు తెలుస్తోంది.