కార్తికేయ 2: ట్రైలర్‌ విడుదల


టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ నటించిన తాజా చిత్రం ‘కార్తికేయ 2’. చందు మొండేటి డైరెక్షన్‌లో బ్లాక్ బస్టర్ ‘కార్తికేయ’ కు సీక్వెల్ గా ఈ సినిమాని తెరకెక్కించారు. అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సూపర్ నేచురల్ మిస్టరీ థ్రిల్లర్ విడుదలకు రెడీ అయింది. దీంతో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. టీజర్ – ట్రైలర్ అనూహ్య రెస్పాన్స్ తెచ్చుకుని.. సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్-2 ను విడుదల చేశారు. మాస్ మహారాజా రవితేజ ఈ ట్రైలర్ ను లాంచ్ చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగింది. ఈ సినిమా శ్రీకృష్ణ తత్వం నేపథ్యంలో మిస్టరీని ఛేదించబోతున్నట్లు తెలుస్తోంది. చరిత్ర మరియు పురాణాల మధ్య యుద్ధాన్ని ‘కార్తికేయ 2’ సినిమాలో చూడబోతున్నట్లు ట్రైలర్ ద్వారా తెలియజెప్పారు. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్, శ్రీనివాసరెడ్డి, ఆదిత్యా మీనన్, వైవా హర్ష తదితరులు ఈ సినిమాలో ఇతర పాత్రలు పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై టీజీ విశ్వప్రసాద్ – అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. వివేక్ కూచిభోట్ల సహ నిర్మాతగా వ్యవహరించారు. పాన్ ఇండియా స్థాయిలో ఆగస్టు 13న తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో ‘కార్తికేయ 2’ చిత్రం విడుదల కాబోతోంది.

CLICK HERE!! For the aha Latest Updates