బాహుబలి సినిమానా..? డైరెక్టర్ ఎవరు..?

బాహుబలి2 సినిమా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతోంది. టాలీవుడ్ తో పాటు అన్ని బాషల్లో కూడా ఈ సినిమాకు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుడు అంటూ రాజమౌళిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అయితే ఒక హీరో మాత్రం బహుబలి సినిమా అని ఒకటి ఉందా..? డైరెక్టర్ ఎవరు..? అని ప్రశించాడట. టాలీవుడ్ హీరో అయి ఉండి బాహుబలి సినిమా గురించి తెలియదా.. సినిమాను మెచ్చుకోకపోయినా పర్వాలేదు కానీ కనీసం యూనిట్ కష్టాన్ని గుర్తించాలి కదా.. ఇంతకీ ఆ హీరో ఎవరనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఈ విషయాన్ని బయటపెట్టింది మరెవరో కాదూ పవన్ సరసన ‘కొమరం పులి’ సినిమాలో నటించిన నికిషా పటేల్. ”బాహుబలి2 చూశావా అని ఓ తెలుగు హీరోను అడిగాను. దానికి ఆయన సినిమా దర్శకుడు ఎవరు అని రివర్స్ లో క్వశ్చన్ వేశారు. ఇంత నిర్లక్ష్యంగా, ఆర్టిఫిషియల్ గా ఎలా ఉన్నావ్. నిన్ను చూస్తుంటే అసహ్యంగా ఉంది” అంటూ నికిషా తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అయితే ఆ హీరో ఎవరనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.