‘నిను వీడని నీడను నేనే’ మూవీ టీజర్‌

యువ హీరో సందీప్‌ కిషన్ ‘నిను వీడని నీడను నేనే’ అంటూ ప్రేక్షకుల్ని భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రమిది. ‌అన్యసింగ్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. వెన్నెల కిశోర్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. కార్తీక్‌ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్‌ ఈ సినిమా కోసం నిర్మాతగా మారడం విశేషం. వెంకటాద్రి టాకీస్‌, వి స్టూడియోస్,‌ విస్తా డ్రీమ్‌ సంస్థలు ఈ చిత్రం నిర్మాణంలో భాగస్వామ్యం వహిస్తున్నాయి. తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

ఈ చిత్రం టీజర్‌ను సోమవారం విడుదల చేశారు. అది 2013 అనుకుంటా.. ఓ మిస్టరీ కేసు అంటూ నటుడు మురళీ శర్మ డైలాగ్‌తో టీజర్‌ ప్రారంభమైంది. ఇందులో సందీప్‌ కిషన్‌ ఏదో సమస్యతో బాధపడుతూ కనిపించారు. సందీప్‌ అద్దం ముందు నిల్చుంటే.. ప్రతిబింబంలో వెన్నెల కిశోర్‌ కనిపించడం ఆసక్తికరంగా అనిపించింది.

CLICK HERE!! For the aha Latest Updates