బోల్డ్‌గా నటించి షాకిచ్చిన అమలాపాల్‌

దక్షిణాది హీరోయిన్ అమలాపాల్ నటించిన తాజా చిత్రం ‘ఆడై’. ఈ సినిమా టీజర్‌ను కొద్దిసేపటి క్రితమే కరణ్ జోహార్ చేతులు మీదుగా విడుదల చేశారు. రత్నకుమార్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. టీజర్ మొత్తం ఒక సస్పెన్స్ వాతావరణం నెలవుకోని ఉండగా ఆఖరులో అమలాపాల్ ఇంట్రీ అయితే అందరికీ షాకిచ్చింది. ఎందుకంటే ఆ షాట్లో అమలాపాల్ బోల్డ్‌గా నటించేసింది. సినిమా కోసం, పాత్ర కోసం అమలాపాల్ ఇలాంటి డేరింగ్ అటెంప్ట్ చేయడాన్ని ప్రేక్షకులు, సినీ ప్రముఖులు అభినందిస్తున్నారు.