HomeTelugu Trendingనితిన్ రంగ్‌దే సరికొత్త రికార్డ్

నితిన్ రంగ్‌దే సరికొత్త రికార్డ్

Nithin Rangde collectionsనితిన్, కీర్తి సురేష్ నటించిన ‘రంగ్‌దే’ 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌ను అందుకుంది. యూత్‌ను ఎంతగానా ఆకట్టుకుంటోంది. కలెక్షన్లు కూడా భారీగానే రాబడుతోంది. మూడో రోజైన ఆదివారం అదిరిపోయే వసూళ్లతో రికార్డులు క్రియేట్ చేసింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. రంగ్‌దే మూవీ ప్రపంచ వ్యాప్తంగా 800 థియేటర్లలో విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లో తన సత్తా చాటడమే కాకుండా అన్నిచోట్లా మంచి స్పందనే వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్లు రాబట్టింది. మూడు రోజుల్లో 10.04 కోట్లు షేర్ రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా రంగ్‌దే మూవీ 23.90 కోట్ల బిజినెస్ జరిగినట్టు చిత్రబృందం ప్రకటించింది. బ్రేక్ ఈవెన్ రావాలంటే మరో 24.5 కోట్లు రావాల్సి ఉందట. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది విడుదలైన తెలుగు చిత్రాల్లో తొలి వీకెండ్‌లోనే ఎక్కువ కలెక్షన్లు అందుకున్న రెండో చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!