‘తోలు బొమ్మలాట’తో రాజేంద్రప్రసాద్‌

ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్‌ కీలకపాత్రలో నటిస్తున్న సినిమా ‘తోలు బొమ్మలాట’. విశ్వనాథ్‌ మాగంటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం ట్విటర్‌ వేదికగా శుక్రవారం విడుదల చేసింది. ‘నా పేరు సోమరాజు. ఈ ఊళ్లో ఎదవలంతా నన్ను సోడాల్రాజు అంటారు. ఇక్కడ అంతా పండగ వాతావరణం ఉండడానికి కారణమేమిటో మీరు తెలుసుకోవాలంటే పది రోజుల క్రితం నేను ఆడించిన తోలు బొమ్మలాట మీకు చెప్తాను వినండి.’ అనే రాజేంద్రప్రసాద్‌ మాటలతో ఈ ట్రైలర్‌ ప్రారంభమయ్యింది.

డబ్బు కంటే ప్రేమాభిమానులే ముఖ్యమనే నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కినట్లు ట్రైలర్‌ చూస్తే తెలుస్తోంది. మాగంటి దుర్గా ప్రసాద్‌ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాలో వెన్నెల కిషోర్‌, విశ్వాంత్‌ దుద్దుంపూడి కీలకపాత్రలు పోషించారు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

CLICK HERE!! For the aha Latest Updates