బాలయ్యతో పూరీ సినిమా.. ఛార్మి స్పందన!

హీరోయిన్‌ ఛార్మి నటనకు దూరంగా ఉంటూ.. డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్ తో కలిసి సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజాగా రామ్ పోతినేనితో ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా తీసి హిట్ కొట్టగా తాజాగా విజయ్ దేవరకొండతో ఓ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ఛార్మి తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా బాలకృష్ణ పై ఆసక్తికర కామెంట్లు చేసింది. బాలయ్యతో సినిమా తియ్యడానికి పూరిజగన్నాథ్ ఎప్పుడో రెడీ అని…కాకపోతే ఆయన తో సినిమా తియ్యాలంటే మంచి కంటెంట్ ఉన్న కథ ఉండాలని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. స్క్రిప్టు కుదిరితే ఇద్దరి కాంబినేషన్ లో సినిమా ఉంటుందని చెప్పింది. అంతే కాకుండా బాలకృష్ణ, పూరీ జగన్నాథ్ మధ్య మంచి రీలేషన్‌ ఉందని తెలిపింది. బాలయ్య ఎంతో పాజిటివ్ గా ఉండే వ్యక్తి అని అంది. ఇక ఇదివరకే బాలయ్య తో పూరీ ‘పైసా వసూల్’ చేసిన సంగతి తెలిసిందే. ఇక మరోసారి వీరి కాంబినేషన్ లో సినిమా అంటే బాలయ్య అభిమానులకు పండగ అనే చెప్పాలి.