మెగామల్టీస్టారర్ ఇప్పట్లో కాదు!

చిరంజీవి, పవన్ కల్యాణ్ లను హీరోలుగా పెట్టి మెగా మల్టీస్టారర్ ప్లాన్ చేశాడు టి.సుబ్బిరామిరెడ్డి. ఈ సినిమాను త్రివిక్రమ్ డైరెక్ట్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశాడు. కానీ ఈ ప్రాజెక్ట్ ఇప్పట్లో సెట్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. రీసెంట్ గా చిరు ఈ విషయంపై కొందరు ప్రశ్నించగా చూద్దాం అన్నట్లుగా స్పందించారట. ప్రస్తుతం చిరంజీవి ఫోకస్ మొత్తం ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ సినిమాపైనే ఉంది.

ఆ సినిమా పూర్తయిన తరువాత బోయపాటి, క్రిష్ వంటి దర్శకులతో పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ఇక పవన్ అయితే వరుస ప్రాజెక్ట్స్ తో బిజీబిజీ. త్రివిక్రమ్ సినిమా పూర్తయిన తరువాత నేసన్ దర్శకత్వంలో మరో సినిమా చేయాల్సివుంది. అలానే త్రివిక్రమ్.. పవన్ సినిమా తరువాత ఎన్టీఆర్, మహేష్ బాబులతో సినిమా చేయనున్నారు. కాబట్టి ఇప్పట్లో మెగామల్టీస్టారర్ వర్కవుట్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు.