‘ఆర్‌ఆర్‌ఆర్‌’ బీమ్‌ వచ్చేది ఆ రోజేనా!


ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం “ఆర్ఆర్ఆర్”. ఈ సినిమాలో రామ్‌ చరణ్, ఎన్టీఆర్‌లు హీరోలుగా నటిస్తుండగా వివిధ ఇండస్ట్రీలకు చెందిన నటీ నటులను కూడా ఎంపిక చేసారు. కాగా చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ బీమ్ ఫర్ రామరాజు అంటూ ఒక స్పెషల్ వీడియోను రిలీజ్‌ చేసారు. ఈ వీడియో రామ్‌ చరణ్ యాక్షన్, ఎన్టీఆర్ డైలాగ్స్ తో చాలా క్రేజ్ సంపాదించింది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రను పరిచయం చేస్తూ మే 20వ తేదీన ఓ వీడియోను విడుదల చేయనున్నట్టుగా చెబుతున్నారు. ఆ రోజున ఎన్టీఆర్ పుట్టినరోజు. అందువలన కొమరం భీమ్ గా ఎన్టీఆర్ ను చూపిస్తూ ఓ వీడియోను వదలనున్నట్టుగా చెప్పుకుంటున్నారు.