ఎన్టీఆర్ బయోపిక్‌: సెకండ్ సింగిల్ వాయిదా!

ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా ‘ఎన్టీఆర్’ బయోపిక్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు కాగా, రెండో భాగం మహానాయకుడు. ఈ భాగాలను ఒకేసారి షూట్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటె, ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ కథానాయిక సాంగ్ ను ఇటీవలే రిలీజ్ చేశారు. అద్భుతమైన రిలిక్స్ తో ఆకట్టుకుంది. రెండో సింగిల్ ను ఈరోజు సాయంత్రం 4:21 నిమిషాలకు రిలీజ్ చేయాల్సి ఉంది. అనుకోని కొన్ని కారణాల వలన సాంగ్ రిలీజ్ డేట్ ను 12 వ తేదీకి పోస్ట్ ఫోన్ చేశారు. 12 వ తేదీ ఉదయం 10:31 గంటలకు ఈ సాంగ్ ను విడుదల చేయబోతున్నారట. ఈ సినిమాలో బాలకృష్ణ ‘ఎన్టీఆర్‌’ పాత్రలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు 10 మందికిపైగా హీరోయిన్లు, టాప్ హీరోలు ఈ సినిమాలో నటిస్తుండడంతో సినిమాపై అందరికీ భారీ ఆసక్తి నెలకొంది.

CLICK HERE!! For the aha Latest Updates